Header Banner

జగన్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయిన బీజేపీ నేత.. సిగ్గు లేకుండా మళ్లీ.!

  Fri May 30, 2025 12:36        Politics

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (Former CM YS Jagan Mohan Reddy) ఏపీ బీజేపీ నేత, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి (AP BJP Leader Bhanu Prakash Reddy) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ మాజీ సీఎం సినిమా చూపిస్తానని అంటున్నారని.. జగన్ హర్రర్ మూవీ చూసి ఏపీ ప్రజలు దడుచుకున్నారని... సిగ్గు లేకుండా మళ్లీ సినిమా చూపిస్తా అంటూ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. 2019 నుంచి 2024 వరకు ఒక హారర్ మూవీని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చూపించిన ఘనత జగన్‌ది అంటూ ఎద్దేవా చేశారు. 11 స్థానాలకు పరిమితం చేసినప్పటికీ జగన్‌ మోహన్ రెడ్డిలో అహంకారం తగ్గలేదన్నారు. ఐదు సంవత్సరాలు ఏపీలో రాక్షస రాజ్యం రాజ్యమేలిందన్నారు. ప్రతిపక్షంలో ఉంటూ అధికార పార్టీ నేతలను బెదిరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తాటాకు చప్పులకు భయపడేవారు ఏపీలో ఎవరూ లేరన్నారు. అధికారం కోల్పోయిన తర్వాత తాను ఏం మాట్లాడుతున్నాడో తెలుసుకోలేని పరిస్థితుల్లో మాజీ సీఎం ఉన్నారని కామెంట్స్ చేశారు. జగన్ సినిమా చూసేందుకు ఎవరు సిద్ధంగా లేరన్నారు. జగన్ భవిష్యత్తులో అధికారంలోకి వచ్చి పరిస్థితి లేదన్నారు.

 

ఇది కూడా చదవండి: పులివెందులలో రాజకీయ దుమారం! 15 మందిపై కేసు నమోదు!

 

శేష జీవితం మొత్తం పబ్జీ గేమ్ ఆడుకుంటూ 70ఎంఎం థియేటర్‌లో సినిమాలు చూస్తూ బతకాల్సిందే అంటూ సెటైర్ విసిరారు. జగన్‌ను నమ్మి ఐఏఎస్ అధికారులు జైలుకు వెళ్లారని గుర్తుచేశారు. తాను 16 నెలల పాటు జైల్లో ఉన్న దగ్గరికే ఐఏఎస్ అధికారులను తీసుకువెళ్లాలని కంకణం కట్టుకున్నట్లు ఉన్నారన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ అధికారులను రాజకీయంగా వాడుకున్నారని విమర్శించారు. అవినీతికి కేరాఫ్ అడ్రస్ వైసీపీ పార్టీ అంటూ వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లలో లక్షల కోట్ల కుంభకోణాలు చేశారన్నారు. మట్టిలో మద్యంలో వేలకోట్ల రూపాయలు వైసీపీ నేతలు అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతికి మూలాలు తాడేపల్లి ప్యాలెస్‌లో ఉన్నాయన్నారు. జగన్ రెడ్డి తాను అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కష్టాలు సమస్యలు తెలుసుకొని ప్రవర్తించారా అని ప్రశ్నించారు. ఏపీని మద్యాంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చిన క్రెడిట్ జగన్‌కే దక్కుతుందని ఫైర్ అయ్యారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన తప్పిదాలకు చట్టపరిధిలోనే జగన్ అండ్ కో బ్యాచ్‌కు శిక్ష ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఏపీని వికసిత ఆంధ్రప్రదేశ్ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ప్రజల కష్టాలు, ఇష్టాలు తెలుసుకునేలా ఏ రోజు జగన్ వ్యవహరించలేదన్నారు. జగన్ విధ్వంసం గాడిలో పెట్టడానికి కూటమి ప్రభుత్వానికి ఏడాది పట్టిందని తెలిపారు. కూటమి ప్రభుత్వాన్ని విమర్శించే నైతికత జగన్‌కు లేదన్నారు. జగన్ అవినీతిపై నిష్పక్షపాతంగా చట్ట పరిధిలో విచారణ జరిపి శిక్షిస్తామన్నారు. జగన్ శేష జీవితం సినిమాలకే సరిపోతుందని.. తనకు సినిమా చూపించే పరిస్థితి ఉండదని భానుప్రకాష్ రెడ్డి పేర్కొన్నారు.

 

ఇది కూడా చదవండి: ఏపీలో మరో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే.. రూ.1400 కోట్లతో..! రూట్లోనే, కేంద్రం గ్రీన్ సిగ్నల్!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

అమెరికాలో భారతీయులు మృతి.. అందుకు కారకులకు జైలు శిక్ష! భారీ మంచు తుఫాన్..

 

మహానాడు వేదికగా చంద్రబాబు కీలక ప్రకటన! దెబ్బకు అంతా సైలెంట్!

 

మందుబాబులకు బ్యాడ్ న్యూస్.. ధరలు పెంపు! క్వార్టర్‌కు రూ.6 నుండి రూ.30 వరకు..

 

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో గద్దర్ అవార్డుల ప్రకటన.. ఉత్త‌మ న‌టుడిగా.. విజేతలు వీరే.!

 

టీడీపీ మహానాడులో తొలిరోజునే రూ.21.53 కోట్ల విరాళాలు! ఎవరెవరు ఎంత ఇచ్చారు అంటే.. ఆ ఎంపీ ఒక్కరే ఏకంగా..

 

ఏపీలో మహిళలకు గుడ్‌న్యూస్..! ఒక్కొక్కరికి ఉచితంగానే రూ.15వేలు, మరో కొత్త పథకం!

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వ్యక్తిపై దాడి కేసు.. 3 రోజుల పోలీసు కస్టడీకి మాజీ ఎంపీ!

 

లోకేష్క కీలక పదవి.. మహానాడులో ప్రతిపాదన.. చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లిన‌ ఎమ్మెల్యే!

 

ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా.. తారక్ ఎమోషనల్ పోస్ట్!

 

పసిడి ప్రియులకు గుడ్‌న్యూస్.. మళ్లీ తగ్గిన బంగారం ధర..! తులం ఎంతంటే…?

 

కొన్ని గంటల్లోనే టీడీపీ అకౌంట్లోకి వచ్చి పడిన రూ.17 కోట్లు! అసలు విషయం ఏమిటంటే?

 

ఊహించని ధరకు మోటో నుంచి ఎడ్జ్‌ 60 స్టైలస్‌.. ఫీచర్లు ఇవే! తమ్ముళ్లు డబ్బు రెడీ చేసుకోండి..

 

టీడీపీ జెండా.. తెలుగు జాతికి అండ! వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదు.. యువగళం పేరుతో..

 

ఏం అదృష్టం సార్..! అడ్డిమార్‌ గుడ్డిదెబ్బ కొడితే.. రూ. 231 కోట్ల జాక్ పాట్!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #AndhraPradesh #BJPLeader #Bhanuprakesh #Jagan #Comments #FireOnjagan #CorruptionMovieCommentsViral